Movie Name: నాలుగు స్తంభాలాట
Producer: N Krishnam Raju
Director: జంధ్యాల
Music Director: రాజన్-నాగేంద్ర
Singer(s): బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
Lyrics: వేటూరి సుందరరామ మూర్తి
Year of Release: 1982
చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ ...నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
నదివి నీవు కడలి నేను మరిచి పోబోకుమా ...హ ...మమత నీవే సుమా || చినుకులా రాలి ||
ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే
కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఒదార్పులే
ప్రేమలు కోరే జన్మలలోనే నే వేచి ఉంటానులే
ప్రేమలు కోరే జన్మలలోనే నే వేచి ఉంటానులే
జన్మలు దాటే ప్రేమను నేనై నీ వేల్లువవుతానులే
ఆ చల్లనే చాలులే
ఆ చల్లనే చాలులే
హిమములా రాలి సుమములై పూసి రుతువులై నవ్వి మదువులై పొంగునీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
శిశిరమైన శిదిలమైన విడిచి పోబోకుమా విరహమై పోకుమా || చినుకులా రాలి ||
తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్ననులే
పులకరమూగే పువ్వుల కోసం వేసారుతున్ననులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
నిన్నలు నేడై రేపటి నీడై నా ముద్దు తిరాలిలే
ఆ తీరాలు చేరాలిలే || చినుకులా రాలి ||
మౌనమై మెరిసి గానమై పిలిచి కలలతో అలిసి గగనమై ఎగసి నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ
ఆ తీరాలు చేరాలిలే || చినుకులా రాలి ||
మౌనమై మెరిసి గానమై పిలిచి కలలతో అలిసి గగనమై ఎగసి నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ
భువనమైన గగనమైన ప్రేమమయమే సుమా ఆ..... ప్రేమమనమే సుమా || చినుకులా రాలి ||
నాలుగు స్తంబాలాట ఈ రోజుల లో చాల మందికి తెలియదు కాని ఒక 20-30 సంవత్సరాల
క్రితం, పల్లెటూర్లలో మండువా లోగిలి ఇళ్ళలో, ఉమ్మడి కుటుంబం లో సాదారణం గా
పిల్లలు ఆడే ఆట. ఈ సినిమా కి ఈ పేరు ఎందుకు పెట్టారో, సినిమా చూసిన ప్రతి
వాళ్ళకి ఆట తెల్సిన ప్రతి వాళ్ళకి అర్థం అవుతుంది. సినిమా గురించి
తెలియాలంటే ఆట గురించి తెలియల్సిందే. ఈ ఆట ఎలా ఆడతారంటే, నాలుగు స్తంబాలు,
అయిదు ఆట ఆడేవాళ్ళు ఉండాలి, నలుగురు స్తంబాలకి అంటి ఉంటె, చివరి ఆటగాడు
మధ్యలో ఉంటాడు( దొంగ అంటారు కొన్ని చోట్ల). ఆ నాలుగు స్తంబాలకి అంటి ఉన్న
ఆటగాళ్ళు మధ్యలో ఉన్న ఆటగాడికి అంటకుండా స్తంబాలు మారాలి. ఎవరైనా
స్తంబానికి అంటుకోకుండా దొరికి పొతే అతను స్థలం మారి మధ్యలోకి వస్తాడు. ఆట
మరల కొనసాగుతుంది. సినిమా లో కూడా నాలుగు పాత్రలు, వాళ్ళు రెండు జంటలు,
వీళ్ళతో ఆడే ఆ ఐదో ఆటగాడే విధి. ఆ విధి ఆడిన ఆటలో ఎవరి జీవితాలు ఎలా
మారతాయి అన్నదే ఈ కథ.
జంధ్యాల గారు తెలుగు సిని పరిశ్రమకి దొరికిన ఒక వైడూర్యం. అయన తీసిన సినిమాలలో ఆయన తీసిన హాస్య చిత్రాలే గుర్తుండి పోయినా మనకి ఆయన లోని సృజనాత్మకత, సాహితి సంపద, సంగీత ప్రజ్ఞ్య చాల ఎక్కువగా ప్రతిబింబిస్తాయి. ఈ "నాలుగు స్తంబాలాట" సినిమాతో అయన చాలా మందిని సినీ పరిశ్రమకి పరిచయం చేసారు. ఈ సినిమా ఆ రోజులలో యువతని ఒక ఊపు ఊపిన సినిమా. ఈ పాట యువతకి జాతీయ గీతం లాగ కొన్ని సంవత్సరాలు మారు మ్రోగింది. సినిమా ఒక ఎత్తు అయితే ఈ పాట ఇంకో ఎత్తు. ఇందులో దర్శకుడు, పాట రచయిత, సంగీత దర్శకుడు ఒకే భావం తో ఏకమైతే ఎలాగా ఉంటుందో తెలియ చెప్పే పాట. బాలు గారు, సుశీల గారు పాట పాడిన, పాత్రలు పాడాయా అనిపిస్తాయి. వాళ్ళ గాత్రం అంత తీయగా, హాయిగా, ప్రేమగా పలకరిస్తాయి. దానికి తోడు ఈ పాట చిత్రీకరణ అడుగడుగునా పాట లోని ప్రతి పదానికి అర్థం ఇదే అన్నట్టు చిత్రీకరించిన పాట. రాజన్-నాగేంద్ర జంట సంగీతం సమకూర్చిన ఈ పాటకి వేటూరి గారు కాక ఇంకెవరు రాయగలరు? వేటూరి గారు ప్రేమకి నిర్వచనం. ఆయన వర్ణించినట్లు ప్రేమని మనం ఎక్కడ వినం, అనుభవించం. ప్రేమ గురించి ఆయన చెప్పినట్టు ఎవ్వరు చెప్పలేరేమో. అంత అత్యద్భుతమైన పాట ఇది. ప్రేమికులకి గొప్ప వరం అప్పటికి ఎప్పటికి ఏ నాటికి. భావుకత తన శరీరమంతా నింపుకున్న పాట ఇది. అంత భావం ఉన్న ప్రేమ పాటలు చాల తక్కువగా చూస్తాం. ఈ రోజుల్లో ఇంతటి తీయని మెలోడి ఇంక వినలేమేమో, ఇలాంటి స్వచమైన తెలుగు పాటలు మరల రావేమో..
ఇంక పాటలోకి వస్తే, అక్షరాలూ అత్యంత అద్బుతం గా పేర్చి కూర్చిన ప్రేమ మాల
ఇది. జలపాతం లా సాగి మదిని అటు ఇటు కదిలించి ఊహ లోకం లో విహరింప చేసే పాట.
చరణం లో అన్ని వాఖ్యలు "లే" తో అంతం అవుతాయి, ఇంక చరణం "మ" తో అంతం
అవుతుంది. ఏదో ప్రాస కోసం రాసినట్టుగా లేకుండా అత్యంత అర్థవంతమైన అక్షరాలు
పొదిగి మన్మధ బాణం విసురుతారు రసజ్ఞుల మీద. ఇంక ప్రేమ అనేది నిర్వచనం లేని
అనుభూతి, వివరింపలేని అనుభవం. అందుకనే మనం అనేక రకాల వివరణలు చూస్తాం
వింటాం. ఇన్ని రకాల సినిమాలు చూడగలుగుతున్నాం. కొంత మంది (వేటూరి గారు)
ప్రేమని వివరిస్తుంటే ఆ వివరణ ఒక మంచి అనుభూతి మిగులుస్తుంది. అందుకే
కథానాయికా నాయకుడు ఒకరి దగ్గరకు ఒకరు పరిగెత్తుకుంటూ వెళ్ళినట్లు మనం కూడా
పాటలోకి వెళ్ళిపోదాం.
చినుకులా రాలి నదులుగా సాగి వరదలై పోయి కడలిగా పొంగు నీ ప్రేమ ...నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
నదివి నీవు కడలి నేను మరిచి పోబోకుమా ...హ ...మమత నీవే సుమా || చినుకులా రాలి ||
పాట ఆరంభం లో రాజన్-నాగేంద్ర గారు మొదలు పెట్టిన తీరు చాల బాగుంటుంది.
జంధ్యాల గారి చిత్రీకరణ సంగీతానికి తోడవుతుంది. చాల మంది నమ్మే ప్రేమ
ఎప్పుడైనా ఒకరి చూపులు ఇంకొకరివి కలిసి, ఆ చూపులు భావాలు గా మరి, ఆ భావాలు
మాటలు గా మారి, మాటలు అనుభూతులు గా మారి, అనుభూతులు అనుబందాలు గా మారి,
చివరికి ఒకరి మనసు ఇంకొకరిది అయితే అదే ప్రేమ. కలకాలం నిలిచే అనుబందం.
శరీరాలకి అతీతంగా మిగిలేది నిజమైన ప్రేమ. అందుకనే ఈ ప్రవాహాన్ని వేటూరి
గారు ప్రక్రుతి సహజమైన తీరుతో పోలుస్తూ ఈ పాట రూపొందించారు. సముద్రం
పురుషుడైతే, నది స్త్రీ అవుతుంది. అందుకే స్త్రీ పురుషుడి కలయిక అలా
పోలుస్తారు. పాట లో కూడా నేను సముద్రం అయితే నువ్వు నదివి అది మర్చిపోకు
అని చేతి లో చెయ్యి వేయించుకుంటాడు కథానాయకుడు. నీ మమత తో నన్ను నీలో
చేర్చుకొని ఆనందం తో ఉప్పొంగి పోయేలా చెయ్యి అంటాడు. నీరు ఆవిరై మబ్బు వాన
గా మారినట్టు, ఆలోచనలు ఆవిరై అవి చూపులు అయినట్టు ప్రేమ చినుకులా రాలి, ఆ
వాన నీరు నది లాగ మారి నది వరదై, సముద్రం లో నది కలిస్తే , సముద్రం ఆనందం
తో ఉప్పొంగితే అదే ప్రేమ అంటారు వేటూరి. నా ప్రేమ కి వేరే నిర్వచనం లేదు నీ
పేరు తప్ప, నా ప్రేమ అంటే నువ్వే. ఎంతటి చక్కటి నిర్వచనం చెప్తారు వేటూరి
గారు ప్రేమ గురించి? జంధ్యాల గారు, నదిని సముద్రాన్ని చూపించారు కాని వానని
చూపించలేదు ఎందుకనో?
శిశిరమైన శిదిలమైన విడిచి పోబోకుమా విరహమై పోకుమా
మరల ప్రేమ ప్రవాహం గురించి చెప్తారు ఈ సారి వేరే విధంగా, అది కూడా మల్ల ప్రకృతిని ఉదాహరణ గా తీసుకొని. మంచు కరిగి నదులు గా మారతాయి అని మనకి తెలుసు, అనేక నదుల ఉద్భవం హిమాలయాల మీద ఉన్న మంచు, అవి కరిగి నదులు అయ్యి, ప్రవహిస్తే, మొక్కలకు పువ్వులు పూస్తే, ఆ పువ్వుల నవ్వులు మనకి ఋతువులు గా కవ్విస్తే, ఆ పువ్వులనుంచి తేనే పొంగితే వచ్చే సహజ సౌందర్యం, ఆహ్లాదం ఆనందం నీ నా ప్రేమ. అది శరీరం శిధిలమైన కాని, కష్టాలు వచ్చిన కాని ఒకరికొకరి దూరం గా పోకుండా, ఒకరిని ఇంకొకరు విడిచి పెట్టకుండా ఉండేలాగా ఉండిపోవాలి అని కోరుకుంటారు ప్రేమికులు. ఈ పద ప్రవాహం కమనీయ సుందర కావ్యం, అదే వేటూరి సుందర కావ్యం.
ఆ తీరాలు చేరాలిలే
మండు వేసవి తరువాత వచ్చే మొదటి వాన కోసం భూమి పరితపిస్తుంది, అలాగే మొక్కలు, చెట్లు, చేలు, ఆ వాన పడగానే అవి పులకరించి పోతాయి పరవశించి పోతాయి. మన్ను సువాసన వెదచల్లుతుంది. అలాంటి వాన అన్నింటి లో కొత్త శక్తిని నింపుతుంది. నేను కూడా అలాగే ఒక తొడిమ పువ్వు పూయటం కొరకు వాన కోసం వేచి చూసే లాగ నీ కోసం వేచి ఉంటున్నాను అంటుంది కథ నాయిక. నింగి నెల కలిసేది లేకపోయినా సముద్ర తీరాన సంధ్య సమయాన రెండు ఎకమైనట్టు ఉంటాయి. నిన్న ఇవ్వాళ అయితే అదే రేపటికి వెన్నంటి ఉంటుంది ఇవ్వాళ. నీడ అవుతుంది అంటే సినెమా లో ఇక్కడ నీడ చూపిస్తారు జంధ్యాల గారు. రేపటికి నీడలా వెంటాడి ఆ పొద్దు సమయం లో నా ముద్దు తీరుతుంది లే అనే ఆశ అందుకనే ఇద్దరు కలిస్తే తీరం చేరినట్టే. ఆ తీరాలు చేరాలిలే అని ఇద్దరినీ పాటలో కలిపేస్తారు.
మౌనమై మెరిసి అనగానే, ఇద్దరినీ ఒక బోర్డు దగ్గర నిలబెడతారు జంధ్యాల గారు అందులో "Those who in love tell each other a thousand things without talking " అని చూపిస్తారు. నిజమే ప్రేమికుల చూపులలో కొన్ని వేల సందేశాలు, మాటలు దాగి ఉంటాయి, అవి వాళ్ళకే అర్థం అవుతాయి. మౌనమే గానము అవుతుంది ఆ గానం తో ఒకరిని ఒకరు పిలుచుకొంటే, ఆ తరువాత వచ్చే కళలు ఉప్పెన లా ఎగసి, ఆ అలల అలజడికి మనసి అలసి పొతే, ఆ అలసటని తీర్చటానికి నీ నా ప్రేమ తారడితే, ఈ ప్రపంచం అంటే మనమే, మన ప్రేమ తో నిండిపోయి అంతటా మనమే కదా అని ముగుస్తారు వేటూరి గారు, ప్రేమకి నిర్వచనం చెప్తారు తనదైన శైలి లో.
ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే
కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఒదార్పులే
ప్రేమలు కోరే జన్మలలోనే నే వేచి ఉంటానులే
ప్రేమలు కోరే జన్మలలోనే నే వేచి ఉంటానులే
జన్మలు దాటే ప్రేమను నేనై నీ వేల్లువవుతానులే
ఆ చల్లనే చాలులే
మరల ప్రకృతినే ఆశ్రయిస్తారు వేటూరి గారు ప్రేమికులకి ప్రేమిస్తున్నాము అని ఒకరికి ఒకరు అర్థం అయ్యేసరికి ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేని స్తితికి వస్తారు. ఆ విరహం లో ఆ ఆలోచనల వేడిమి లో కలిగే తాపం లో వచ్చే నిట్టూర్పులు ఎంత వేడిగా ఉంటాయి అంటే, ఆకులు రాలే కాలం లో వేసవి గాలి వేడి అంత. మరి అంత వేడి, తాపం తగ్గేది ఎలా అంటే కుంకుమ పువ్వు పూసే పొద్దున్న లాగ ఉండాలి అని. కుంకుమ పువ్వు చాల తక్కువ కాలం ఉంటాయి అవి కూడా చల్లని ప్రదేశాలలో మాత్రమె పూస్తాయి. మరల కొంచెం వేడి తగిలినా ఆ పూలు పాడయిపోతాయి. అలాంటి చల్లదనం తో వచ్చే కుంకుమ పువ్వు తనకి ఇచ్చే బలం అతనికి ఓదార్పు కావాలి. ఎక్కడినించి ఎక్కడికి వెళ్లారు వేటూరి గారు? ఇంకా జన్మ జన్మల బందం మన ప్రేమ. నీ కోసం వేచి ఉంటాను అనటం సాధారణం గా ప్రేమికులు వాడే పదమే. కాని ఆ జన్మలు ఎలా ఉండాలి? ప్రేమలు కొరేవి గానే ఉండాలి. అందులోనే నీకోసం వేచి ఉంటాను అంటూనే, ఆ జన్మల తో సంభందం లేకుండా, అవి దాటి నీ దానిని అవుతాను అంటుంది కథానాయిక. సినిమాలో జంధ్యాల గారు కథానాయిక వేచి ఉండటం చూపిస్తారు.
హిమములా రాలి సుమములై పూసి రుతువులై నవ్వి మదువులై పొంగునీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ ఆ చల్లనే చాలులే
మరల ప్రకృతినే ఆశ్రయిస్తారు వేటూరి గారు ప్రేమికులకి ప్రేమిస్తున్నాము అని ఒకరికి ఒకరు అర్థం అయ్యేసరికి ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేని స్తితికి వస్తారు. ఆ విరహం లో ఆ ఆలోచనల వేడిమి లో కలిగే తాపం లో వచ్చే నిట్టూర్పులు ఎంత వేడిగా ఉంటాయి అంటే, ఆకులు రాలే కాలం లో వేసవి గాలి వేడి అంత. మరి అంత వేడి, తాపం తగ్గేది ఎలా అంటే కుంకుమ పువ్వు పూసే పొద్దున్న లాగ ఉండాలి అని. కుంకుమ పువ్వు చాల తక్కువ కాలం ఉంటాయి అవి కూడా చల్లని ప్రదేశాలలో మాత్రమె పూస్తాయి. మరల కొంచెం వేడి తగిలినా ఆ పూలు పాడయిపోతాయి. అలాంటి చల్లదనం తో వచ్చే కుంకుమ పువ్వు తనకి ఇచ్చే బలం అతనికి ఓదార్పు కావాలి. ఎక్కడినించి ఎక్కడికి వెళ్లారు వేటూరి గారు? ఇంకా జన్మ జన్మల బందం మన ప్రేమ. నీ కోసం వేచి ఉంటాను అనటం సాధారణం గా ప్రేమికులు వాడే పదమే. కాని ఆ జన్మలు ఎలా ఉండాలి? ప్రేమలు కొరేవి గానే ఉండాలి. అందులోనే నీకోసం వేచి ఉంటాను అంటూనే, ఆ జన్మల తో సంభందం లేకుండా, అవి దాటి నీ దానిని అవుతాను అంటుంది కథానాయిక. సినిమాలో జంధ్యాల గారు కథానాయిక వేచి ఉండటం చూపిస్తారు.
శిశిరమైన శిదిలమైన విడిచి పోబోకుమా విరహమై పోకుమా
మరల ప్రేమ ప్రవాహం గురించి చెప్తారు ఈ సారి వేరే విధంగా, అది కూడా మల్ల ప్రకృతిని ఉదాహరణ గా తీసుకొని. మంచు కరిగి నదులు గా మారతాయి అని మనకి తెలుసు, అనేక నదుల ఉద్భవం హిమాలయాల మీద ఉన్న మంచు, అవి కరిగి నదులు అయ్యి, ప్రవహిస్తే, మొక్కలకు పువ్వులు పూస్తే, ఆ పువ్వుల నవ్వులు మనకి ఋతువులు గా కవ్విస్తే, ఆ పువ్వులనుంచి తేనే పొంగితే వచ్చే సహజ సౌందర్యం, ఆహ్లాదం ఆనందం నీ నా ప్రేమ. అది శరీరం శిధిలమైన కాని, కష్టాలు వచ్చిన కాని ఒకరికొకరి దూరం గా పోకుండా, ఒకరిని ఇంకొకరు విడిచి పెట్టకుండా ఉండేలాగా ఉండిపోవాలి అని కోరుకుంటారు ప్రేమికులు. ఈ పద ప్రవాహం కమనీయ సుందర కావ్యం, అదే వేటూరి సుందర కావ్యం.
తొలకరి కోసం తొడిమను నేనై అల్లాడుతున్ననులే
పులకరమూగే పువ్వుల కోసం వేసారుతున్ననులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
నిన్నలు నేడై రేపటి నీడై నా ముద్దు తిరాలిలేనింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
ఆ తీరాలు చేరాలిలే
మండు వేసవి తరువాత వచ్చే మొదటి వాన కోసం భూమి పరితపిస్తుంది, అలాగే మొక్కలు, చెట్లు, చేలు, ఆ వాన పడగానే అవి పులకరించి పోతాయి పరవశించి పోతాయి. మన్ను సువాసన వెదచల్లుతుంది. అలాంటి వాన అన్నింటి లో కొత్త శక్తిని నింపుతుంది. నేను కూడా అలాగే ఒక తొడిమ పువ్వు పూయటం కొరకు వాన కోసం వేచి చూసే లాగ నీ కోసం వేచి ఉంటున్నాను అంటుంది కథ నాయిక. నింగి నెల కలిసేది లేకపోయినా సముద్ర తీరాన సంధ్య సమయాన రెండు ఎకమైనట్టు ఉంటాయి. నిన్న ఇవ్వాళ అయితే అదే రేపటికి వెన్నంటి ఉంటుంది ఇవ్వాళ. నీడ అవుతుంది అంటే సినెమా లో ఇక్కడ నీడ చూపిస్తారు జంధ్యాల గారు. రేపటికి నీడలా వెంటాడి ఆ పొద్దు సమయం లో నా ముద్దు తీరుతుంది లే అనే ఆశ అందుకనే ఇద్దరు కలిస్తే తీరం చేరినట్టే. ఆ తీరాలు చేరాలిలే అని ఇద్దరినీ పాటలో కలిపేస్తారు.
మౌనమై మెరిసి గానమై పిలిచి కలలతో అలిసి గగనమై ఎగసి నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ
భువనమైన గగనమైన ప్రేమమయమే సుమా ఆ..... ప్రేమమనమే సుమా || చినుకులా రాలి ||
మౌనమై మెరిసి అనగానే, ఇద్దరినీ ఒక బోర్డు దగ్గర నిలబెడతారు జంధ్యాల గారు అందులో "Those who in love tell each other a thousand things without talking " అని చూపిస్తారు. నిజమే ప్రేమికుల చూపులలో కొన్ని వేల సందేశాలు, మాటలు దాగి ఉంటాయి, అవి వాళ్ళకే అర్థం అవుతాయి. మౌనమే గానము అవుతుంది ఆ గానం తో ఒకరిని ఒకరు పిలుచుకొంటే, ఆ తరువాత వచ్చే కళలు ఉప్పెన లా ఎగసి, ఆ అలల అలజడికి మనసి అలసి పొతే, ఆ అలసటని తీర్చటానికి నీ నా ప్రేమ తారడితే, ఈ ప్రపంచం అంటే మనమే, మన ప్రేమ తో నిండిపోయి అంతటా మనమే కదా అని ముగుస్తారు వేటూరి గారు, ప్రేమకి నిర్వచనం చెప్తారు తనదైన శైలి లో.
కొసమెరుపు: ఈ పాట మొదట "రాజన్-నాగేంద్ర" గార్లు 1977కన్నడ సినిమా "Bayaludari" లో ఈ పాట చేస్తే కొంచెం మార్చి 1982 లో "నాలుగు స్తంభాలాట" కి మరల చేసారు. ఇదే పాటని 1992 హిందీ లో "ऐसी दीवानगी" అనే పాట గా కాపీ కొట్టిన నదీం శ్రావణ్ కి ఫిలిం ఫెయిర్ అవార్డు రావటం విచిత్రం.
ఈ సినిమా తో సుత్తి అనే పదానికి సృష్టి కర్త అయ్యారు జంధ్యాల గారు, ఆ పదం ఇంటి పేరు గా మారింది, వేలు గారికి వీరభద్ర రావు గారికి.
0 comments